Mar 11,2023 19:36

పోలింగ్‌ కేంద్రం పరిశీలిస్తున్న రెవెన్యూ,పోలీస్‌ అధికారులు

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

చాగలమర్రి:
చాగలమర్రి పట్టణంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు సంబంధించి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను ఇన్‌చార్జ్‌ సిఐ జీవన్‌ గంగనాధ్‌ బాబు, తహసీల్దారు విజరు కుమార్‌లు శనివారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద విద్యుత్‌, నీటి సౌకర్యాలను పరిశీలించారు. రెండు పోలింగ్‌ కేంద్రాలు పట్టభద్రుల కోసం, ఒక పోలింగ్‌ కేంద్రం ఉపాధ్యాయుల కోసం ఏర్పాటు చేశామని వారు వివరించారు. ఎన్నికల నిబంధనలను పాటించాల న్నారు. పోలింగ్‌ రోజు ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ వివరించారు. ఈకార్యక్రమంలో ఎస్‌ఐ రమణయ్య, ప్రధానోపాధ్యాయులు కోటయ్య, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.