Sep 06,2023 00:44

ప్రజాశక్తి - వేటపాలెం
రానున్న సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ బూతులను సన్నద్ధం చేస్తున్నట్లు చీరాల ఆర్డీవో పి సరోజినీ తెలిపారు. మండలంలోని 69పోలింగ్ బూతులకు గాను నాయనపల్లి, పుల్లరిపాలెం తప్ప అన్నిటిని పరిశీలించారు. పోలింగ్ బూతుల లెవెల్‌లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. వేటపాలెం, దేశాయిపేట, రామన్నపేట ప్రాంతాలలో పోలింగ్ బూతులలో వసతుల లేమిని గుర్తించామన్నారు. ఆయా బూతులలో ర్యాంపులు నిర్మించాలని తహశీల్దారు అశోకవర్ధాన్‌ను ఆదేశించారు. వీల్ చైర్స్, వాకర్స్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఉన్న వేటపాలెం పోలింగ్ బూత్ వివరాలు సేకరించారు. మరుగుదొడ్లు, కరెంటు సౌకర్యం, ప్లగ్ పిన్నులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట మండల సర్వేర్ సాయి ఉన్నారు.