ఉమ్మడి జిల్లాలోని అంగన్వాడీల పోలికేక ప్రతిధ్వనించింది. తమ న్యాయబద్దమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట 36 గంటల పాటు చేపట్టిన నిరసన దీక్ష జయప్రదమైంది. జిల్లాలోని సుమారు ఏడు వేల మందికిపైగా అంగన్వాడీలు కలిసికట్టుగా చేపట్టారు. అంగన్వాడీల పోరా టానికి ఇంటి దగ్గర నుంచి భోజనాలు తెచ్చుకుని నిరసన పథానికి సంకల్పం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చేయాలని కోరుతూ అంగన్వాడీల డిమాండ్ న్యాయ బద్దమైనది. ఇటువంటి న్యాయమైన డిమాండ్లను పాలకులు చిత్తశుద్ధితో నెరy ేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 చెల్లించాలని, తెలంగాణ తరహాలో వేతనాలు ఉండాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వాలని నినది ంచారు. 1985లో అంగన్వాడీల వ్యవస్థ ఆవిర్భావం నుంచి అంగన్వాడీలు సమ స్యలతో పోరాడుతున్న నేపథ్యం అందరికీ తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల రానున్న తరుణంలో అంగన్వాడీలు చేయిచేయూ కలిపి వినూత్న రీతిలో చేపట్టిన పోరాట పథాన్ని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అంగన్వాడీల శాంతియుత దీక్షలను, నిరసనలను మౌనంగానే పరిశీలించింది. ఇటువంటి దీక్షాదీక్షలతో మరింత కలిసికట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నికల ఏడాది కావడంతో అంగన్వాడీల పోరాటాన్ని ఆమోదనీయమని గ్రహించినట్లు నటించినట్లు అర్థమవుతోంది. రాబోయే సుమారు పది నెలల వ్యవధిలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో పటి ష్టమైన కార్యాచరణతో ఉద్యమాన్ని కొంతపుంతలు తొక్కించాల్సి ఉంది. తమ న్యా యద్దమైన డిమాండ్లను కలిసికట్టుగా ఉద్యమించడంద్వారా సాధ్యమవుతుందనే నమ్మకాన్ని అంగన్వాడీల్లో ప్రోదిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్ప వచ్చు. ఉద్యమ నాయకత్వం సైతం పోరాటాల ద్వారానే తమ న్యాయబద్దమైన డిమాండ్లను సాధించుకునే అవకాశం ఉందని గ్రహించాల్సి ఉంది. ఉద్యమ తీవ్ర తను మరింత క్రియాశీలం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవస రమైన మరిన్ని సమరశీల పోరాటాల అమలుకు ఉద్యమ ప్రణాళికకు రూపకల్పన చేసి కార్యాచరణకు చిత్తశుద్ధితో ఉపక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. - ప్రజాశక్తి- కడప ప్రతినిధి










