Oct 27,2023 00:09

ప్రజాశక్తి - పంగులూరు
పోలీసులంటే ప్రజాసేవకులని, అరాచక శక్తులను అదుపులోకి తీసుకొని, ప్రజలకు సుఖశాంతులు అందించడమే బాధ్యతని రేణింగవరం ఎస్సై తిరుపతిరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఎస్పీ వకూల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని, విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులతో ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ ద్వారా ప్రజలకు విస్తారమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. వారి సేవలకు గుర్తుగా పోలీసు అమరవీరుల వారోత్సవాలు ప్రతి ఏటా ప్రత్యేకంగా జరుపుతున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ సిబ్బంది విధులు గురించి విద్యార్ధులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో విద్యార్థులతోపాటు రేణింగవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.