Jan 31,2023 23:33

వైద్య శిబిరంలో పాల్గొన్న ఎస్‌పి గౌతమిశాలి, వైద్యులు

ప్రజాశక్తి-అనకాపల్లి
స్థానిక ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ గౌతమి శాలి పర్యవేక్షణలో హోంగార్డు నుంచి ఎస్సై వరకు విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందికి నిష్ణాతులైన వైద్య బృందంతో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. హిమోగ్లోబిన్‌ పరీక్షలు, రక్తపోటు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశాఖ రేంజ్‌ డీఐజీ ఎస్‌ హరికృష్ణ, ఎస్పీ గౌతమి సాలి, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ శ్వేత మాట్లాడుతూ మహిళా పోలీసులు ఇంట్లోనూ, వృత్తిపరంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, వారు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబం బాగుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లి పిల్లల ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ మాధురి, జిల్లా పోలీసు యూనిట్‌ వైద్యులు తపస్సు ఆర, ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి వైద్యులు ప్రతిభ, నీరజ, ఝాన్సీ రాణి, పౌష్టికాహార నిపుణులు డాక్టర్‌ లావణ్య, అదనపు ఎస్పీలు బి విజయభాస్కర్‌, పి సత్యనారాయణ రావు, ఇన్స్పెక్టర్లు నరసింహారావు, చంద్రశేఖర్‌, లక్ష్మణమూర్తి, ఏవో శారద పాల్గొన్నారు.