
పోలీసుల సమస్యలు వింటున్న ఎస్పీ
పుట్టపర్తి రూరల్: పోలీసుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని శ్రీ సత్య జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పుట్టపర్తి లోనిపోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పోలీసుల తమ సమస్యలను. ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల భద్రతను కాపాడే పోలీసులకు సమస్యలు ఉంటే వాటిని తీర్చే బాధ్యతను జిల్లా పోలీస్ అధికారిగా తనపై ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డీఎస్పీ విజరు కుమార్, ఆర్‌ఐలు టైటస్, నారాయ తదితరులు పాల్గొన్నారు.