కడప అర్బన్ శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది సేవలు వెలకట్ట లేనివని నాల్గవ జిల్లా అదనపు న్యాయ మూర్తి, జిల్లా ఇన్‌ఛార్జి న్యాయమూర్తి దీన బాబు కొనియాడారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించే క్రమంలో ప్రాణాలు సైతం అర్పించారని పేర్కొన్నారు. శనివారం నగరంలోని పోలీసు పెరేడ్ మైదానంలో నిర్వ హించిన స్మతి పెరేడ్‌కు ఎస్‌పి సిద్దార్థ్ కౌశల్ పాటు, జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి దీనా బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బగా వారు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పోలీసు యూనిఫార్మ్‌కు సమాజంలో అత్యంత గౌరవం ఉందన్నారు. పోలీసు శాఖలో విధులు సంక్లిష్టంగా ఉంటాయన్నారు. దేశానికి సైనికులు, పోలీసు వ్య్వవస్థ రెండు కళ్లు వంటివని, కళ్ళు బాగున్నపుడే సమాజం సురక్షితంగా ఉంటుందన్నారు. సైనికులు దేశ సరిహద్దుల్లో, పోలీసులు దేశంలోని అంతర్గత శాంతిభద్రతల సంరక్షణకై పోరాడుతూ ప్రజలు ప్రశాం తంగా జీవించేలా కషి చేస్తున్నారన్నారు కరోనా సమయంలో ప్రజలను కట్టడి చేసి వారి ప్రాణాలను కాపాడారన్నారు. దేశంలో తమ బాధ్యతను నెరవేర్చే క్రమంలో 38 వేల మంది పోలీసులు ప్రాణాలు అర్పించారన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాదిలో జిల్లాలో ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం బాధా కరమన్నారు. అందించిన సేవలకు పోలీసు శాఖ ఎప్పటికి రుణపడి ఉంటుం దన్నారు. వారి కుటుంబ సభ్యులకు పోలీసు శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా లో విధినిర్వహణలో అమరులైన పోలీసు, హోమ్ గార్డుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు.
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా పెరేడ్ గ్రౌండ్‌లో జిల్లా పోలీసు శాఖ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, సాధించిన విజయాలకు సంబంధించిన ఛాయా చిత్రాలతో కూడిన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఒక్కో ఛాయా చిత్రానికి సంబంధించి వివరాలను విశదీకరించారు. పోలీసులు వినియో గించే ఆయుధాలు, సామాగ్రి ప్రదర్శన 'ఓపెన్ హౌస్' ఏర్పాటు చేశారు ప్రదర్శనలో నేర పరిశోధనలో ఉపయో గించే డాగ్ స్వ్కాడ్ బందంలో ఇటీవల నూతనంగా చేరిన డయానా, రూబీ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్‌పి జాగిలాల గురించి జిల్లా ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తికి వివరించారు. నేర పరిశోధనలో, విఐపి ల రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి(అడ్మిన్) తుషార్ డూడి, స్పెషల్ ఎన్‌ఫోర్సు మెంట్ బ్యూరో అదనపు ఎస్‌పి ప్రవీణ్ కుమార్, ఏ.ఆర్ అదనపు ఎస్‌పి ఎస్.ఎస్ .ఎస్.వి కష్ణారావు, ఎఆర్‌డిఎస్‌పి రమణయ్య, డిఎస్‌పి బాలస్వామి రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డి, ఆర్‌ఐలు వీరేష్, సోమశేఖర్ నాయక్, శ్రీశైలరెడ్డి, ఆనంద్, నగరంలోని సి.ఐ లు, ఎస్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, అసో సియేషన్ సభ్యులు, అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.










