Oct 28,2022 23:38

రక్తదానం చేస్తున్న పోలీసు సిబ్బంది

ప్రజాశక్తి-చింతూరు
చింతూరు డివిజన్‌ కేంద్రంలోని పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. 42 మంది బ్లడ్‌ డోనర్స్‌ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక ఎఎస్పీ మహేశ్వర్‌ రెడ్డి ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయాలైన క్షతగాత్రులకు. అనారోగ్య కారణంగా అత్యవసర పరిస్థితుల్లో రక్తం కొరతను తీర్చేందుకు పలువురి ప్రాణాలను కాపాడేందుకు ఇటువంటి రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏఎస్‌పి మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో చింతూరు సిఐ అప్పలనాయుడు. ఎస్సై యాదగిరి సిఆర్పిఎఫ్‌ వారు తదితరులు పాల్గొన్నారు.