Jun 15,2023 00:37

రక్తదానం చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి- రంపచోడవరం : స్థానిక పోలీసు డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సహకారంతో బుధవారం మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఐ సురేష్‌ కుమార్‌, ఎస్‌ఐ మోహన కుమార్‌, పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. కొంత మంది డిగ్రీ విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. రంపచోడవరం ఏఎస్పీ జగదీష్‌ అడహల్లి రక్తదాన శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగుల కోసం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌ కౌన్సిలర్‌ వాసు, బ్లడ్‌ బ్యాంక్‌ బృందం, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.