Dec 07,2022 23:25

ఎత్తు కొలతలు చూస్తున్న కొయ్యూరు సిఐ స్వామినాయుడు తదతరులు

ప్రజాశక్తి-అడ్డతీగల
పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న పలువురు గిరిజన అభ్యర్థులకు పోలీస్‌ శాఖ స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా సీఐ వై రాంబాబు, ఎస్‌ఐ అప్పలరాజు ఆధ్వర్యంలో బుధవారం అడ్డతీగలలో రాత పరీక్ష, స్కీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. మండలంలోని 74 మంది పురుషులు, 43 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. గిరిజన అభ్యర్థులకు ఎత్తు, శారీరక కొలతలతో పాటు రాత పరీక్ష వంటివి నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పోలీసు ఉద్యోగాల సాధనకు త్వరలో జరగబోయే పరీక్షలకు ఐటిడిఏ సహకారంతో శిక్షణ ఇస్తామని సిఐ, ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది శ్రీనివాస్‌ రాంబాబు గంగాధర్‌ మొదలగు వారు పాల్గొన్నారు.
మారేడుమిల్లి : మారేడుమిల్లి సీఐ అద్దంకి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసు పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎత్తు, బరువులు వంటి స్కీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పోలీస్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న 13 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గుర్తేడు ఎస్సై జ్వాల సాగర్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
కొయ్యూరు : గిరిజన యువత జీడీ, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్‌ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కొయ్యూరు సీఐ ఎ.స్వామినాయుడు పిలుపునిచ్చారు. బుధవారం, కొయ్యూరు ఎస్సై రాజారావు, మంప ఎస్సై లోకేష్‌ కుమార్‌తో కలిసి కాకరపాడులోని గురుకుల జూనియర్‌ కళాశాలలో కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించారు. టెస్ట్‌కు 84 మంది విద్యార్థులు హాజరయ్యారని సీఐ చెప్పారు.