ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్
రాఖీ పౌర్ణమి సందర్భంగా పోలీసులకు విద్యార్ధినిలు రాఖీలు కట్టారు. స్థానిక జెడ్‌పి బాలికల ఉన్నత పాఠశాల నుండి కొంతమంది బాలికలు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి సీఐ సూర్యనారాయణ, ఎస్ఐ షేక్ నాయబ్ రసూల్‌కు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపి రాఖీలు కట్టి ఆనందాన్ని పోలీసులతో పంచుకున్నారు. ఈసందర్భంగా సిఐ సూర్యనారాయణ దిశ చట్టం గురించి పిల్లలకు అవగాహన కల్పించారు. ఆపద వచ్చినప్పుడు దిశా ఎస్‌ఒఎస్‌ను ఏవిధంగా ఉపయోగించుకోవాలో వివరించినారు. బాలికలు పోలీసు సిబ్బందితో మమేకమై పోలీస్ స్టేషన్ ఆవరణ గురించి తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్ధినులను అభినందించారు.










