Apr 20,2023 17:22

అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేస్తున్న అడిషనల్ ఎస్పీ

 

పోలీసు  అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ తనిఖీ
 ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్

      పోలీస్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికార్డులను పక్కాగా అమలు చేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్. రమణ సిబ్బందిని ఆదేశించారు.గురువారం నంద్యాల జిల్లా ఎస్పీ  కె.రఘువీర్ రెడ్డి  ఆదేశాలమేరకు జిల్లా అడిషనల్ ఎస్పీ ఆర్ .రమణ  నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల  నంద్యాల జిల్లా  పోలీసు  అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని (డీపీవో ) ఆకస్మిక తనిఖీ చేశారు.డీపీవో కార్యాలయ సిబ్బందితో మాట్లాడి ఆఫీసుకు సంబందించిన రికార్డులు సరిగా ఉన్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు.జిల్లా  పోలీసు  అడ్మినిస్ట్రేషన్ నందు గల ఒకొక్క విభాగం వాటికి సంబందించిన రికార్డులను పరిశీలించారు. ఈ సంధర్భంగా అడిషనల్ ఎస్పీ ఆఫీసు సిబ్బంది ఏ టైం కు వస్తున్నారని వారి అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.  ఇన్ వర్డ్,అవుట్ వర్డ్ రిజిస్టర్స్ ను తనిఖీ చేశారు.తపాలకు సంబందించిన రికార్డులు సరిగా ఉంచుకోవాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బంది యొక్క మెడికల్ బిల్లులకు సంబంధించిన  రికార్డులను తనిఖీ చేసి పెండింగ్ బిల్లులను త్వరగా క్లియర్ చేసి సిబ్బందికి టైం కు  అందించాలని ,ఆఫీసు నందు పెండింగ్ ఉండకుండా చూసుకోవాలని ఆదేశించారు.పోలీసు సీనియారిటీకి సంబండిచిన రికార్డులను,వారి ప్రమోషన్ కు సంబందించిన రికార్డులను ఎలాంటి అవకతవకకు తావులేకుండా జాగ్రతగా ప్రభుత్వ నిబందనల ప్రకారం ప్రమోషన్ వచ్చేలా రికార్డులు ఉంచుకోవాలని ఆదేశించారు.సిబ్బందికి సంబందించిన సెలవుల రిజిస్టర్ ను తనిఖీ చేసి వాటికి సంబండిచిన రికార్డులు సరిగా ఉంచుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  జిల్లా పోలీసు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నిజాముద్దీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.