Aug 23,2023 19:19

రికార్డులు పరిశీలిస్తున్న డిఎస్‌పి

ప్రజాశక్తి - లింగసముద్రం : మండలంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడాలని కందుకూరు డిఎస్‌పి రామచంద్ర చెప్పారు. బుధవారం ఆయన లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌ను తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చినట్లు తెలిపారు. రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకున్నట్లు చెప్పారు. లింగసముద్రంలో మొరాయించిన సిసి కెమెరాలను వెంటనే మరమ్మత్తులు చేయించాలని చెప్పారు. అవసరమైతే సిసి కెమెరాలను పెంచాలని ఎస్‌ఐ ఎం.బాజిబాబుకు సూచించారు. రాత్రి సమయాల్లో నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని చెప్పారు.