ఆగిరిపల్లి:మహిళల రక్షణ, భద్రతే ధ్యేయంగా సిఎం జగన్ పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం ఆగిరిపల్లిలో నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత ఆమె స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతిఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో పనిచేయాలన్నారు. పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక సాయం చేసిన దాతలను ఆమె సన్మానించారు. ఐజి పాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైం రేటు తగ్గడంలో పోలీసుల పాత్ర అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ మేకా వెంకటప్రతాప్ అప్పారావు, ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నూజివీడు సబ్‌కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, నూజివీడు డిఎస్‌పి అశోక్‌కుమార్‌గౌడ్, రూరల్ సిఐ అంకబాబు, ఆగిరిపల్లి ఎసై చంటిబాబు, జెడ్‌పిటిసి సభ్యులు వీరబాబు, ఎపిపి అనూష, ఆగిరిపల్లి సర్పంచి లక్ష్మీ విక్టర్‌బాబు, ఎంపిటిసిలు గోపినాధ్ పాల్గొన్నారు.










