ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: చిత్తూరు పట్టణంలోని డాగ్‌స్క్వాడ్ విభాగం ఆవరణలో జెస్సి అనే పోలీస్ శునకం ఆదివారం క్యాన్సర్‌తో మరణించింది. దాదాపు తొమ్మిది ఏళ్ళ 8నెలల పాటు పోలీసు డిపార్టుమెంటుకు సేవలందించిన జెస్సి అనే పోలీసు శుకనానికి జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వర రావు పర్యవేక్షణలో దహన క్రియలను ఆర్‌ఐ అడ్మిన్ నీలకంటేశ్వర రెడ్డి పోలీస్ డాగ్‌స్క్వాడ్ యూనిట్‌లో నిర్వహించారు. ఆర్‌ఐ జెస్సికి శాలువా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసు విధుల్లో జెస్సి చేసిన సేవలను కొనియాడారు. పలు కేసుల దర్యాప్తుల్లో జెస్సి చేసిన సేవలను అభినందించారు. ఆర్‌ఐ అడ్మిన్‌తో పాటు ఆర్‌ఎస్‌ఐ రాంమోహన్, డాగ్ స్క్వాడ్ ఇంచార్జి ఏఆర్‌ఎస్‌ఐ రఘు హాజరయ్యారు.










