Sep 23,2023 20:16

ఉత్తమ విద్యార్థినులకు బహుమతులిస్తున్న ఎస్‌పి

ప్రజాశక్తి - తెర్లాం : స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను శనివారం జిల్లా ఎస్‌పి దీపిక పాటిల్‌ తనిఖీ చేశారు. ఎస్‌ఐ ఆర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించి స్వాగతం పలికారు. అనంతరం గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో ఆమె కాసేపు ముచ్చటించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో ఎన్నికలు ఉన్న సందర్భంగా గ్రామాల్లో సామరస్యమైన వాతావరణం నెలకొల్పేటట్లు ఎస్‌ఐ సహాయంతో కృషి చేయాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. అనంతరం రికార్డులు పరిశీలన చేసి క్రైమ్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ రమేష్‌ సౌజన్యంతో ఉత్తమ విద్యార్థులకు ఎస్‌పి చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ తనిఖీల్లో వారితోపాటు డిఎస్‌పి, సిఐ, తెర్లాం, బాడంగి, రామభద్రపురం ఎస్‌ఐలు పాల్గొన్నారు.