Nov 17,2023 20:50

పామును పట్టుకున్న హోంగార్డు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం :  మండలంలోని ఎల్విన్‌పేట పోలీస్‌ స్టేషన్‌లోకి శుక్రవారం రాత్రి రక్తపింజరి పాము చొరబడింది. దీన్ని గమనించిన హోంగార్డు అప్రమత్తమై పట్టుకొని అడవికి తీసుకువెళ్లి విడిచిపెట్టాడు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.