ప్రజాశక్తి-చిట్వేలి
మండల పరిధిలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఎస్‌పి ఆర్.గంగాధర్‌రావు పరిశీ లించారు. వివిధ రకాల కేసుల్లో పట్టుబడిన వాహ నాలను, దశాబ్దం పైబడినటువంటి పురాతనమైన పోలీస్‌స్టేషన్‌ను పరి శీలించారు. ఈ సంద ర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ రైడర్స్ ఓకే వ్యక్తి రెండవ సారి పట్టుపడితే వారిపై జరి మానా తో పాటు శిక్ష కూడా ఉంటుందని అన్నారు. సరిహద్దు ప్రాంతమైన చెక్‌పోస్టు వద్ద నిఘా ఉంచామన్నారు. దుకాణ దారులు వినియోగించే సిసి కెమెరాలు రోడ్డు వైపు కూడా ఉండేలా సహకరిం చాలని, కొత్త వ్యక్తులు సంచరించిన వెంటనే వారిని పట్టుకునేందుకు వీలుంటు ందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే కఠిన చర్యలు తప్పవు అన్నారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని దాని ద్వారా ప్రమాదం ఉన్నప్పుడు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. అనంతరం ఇటీవల వివా దాస్పదంగా మారిన పోలోపల్లి శ్రీరాముల ఆలయాన్ని అక్కడ పరిస్థితులు పరిశీలించారు. కార్యక్రమంలో సిఐ ఎన్ నరసింహారావు, ఎస్‌ఐ సుభాష్ చంద్రబోస్, ఎఎస్‌ఐ యంగయ్య, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పిసిలు రవి, మహేష్, సుధాకర్, రెడ్డయ్య మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










