ప్రజాశక్తి - మండవల్లి
స్థానిక పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కైకలూరు ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరావు సంబంధిత అధికారులకు సూచించారు. మండల పరిషత్ పాఠశాల-1 వెనుక చేపడుతున్న స్టేషన్ నిర్మాణ పనులను, కుమ్మరి కోడులో చేస్తున్న మెరక పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ మెరక పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ నెల 18 తర్వాత శంకుస్థాపన చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. శంకుస్థాపన అనంతరం పనులను త్వరితగతన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, పార్టీ మండల అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు బొమ్మనబోయిన గోకర్ణ యాదవ్, చేబోయిన వీర్రాజు సిఐ వైవిఆర్.నాయుడు, ఎస్‌ఐ టి.రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










