ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ఆజాదీకా అమృత్ మహౌత్సవంలో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి 'నా మట్టి నా దేశం, నేల తల్లికి నమస్కారం, వీరులకు వందనం' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహిం రు. ఈ సందర్భంగా ఏఆర్ డిఎస్‌పి ఎండిహెచ్ ప్రేమ్ కుమార్, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది జాతీయ జెండాను ఎగురవేసి, అమరవీరులకు వందనం చేపట్టి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. డిఎస్‌పి పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అమరవీరుల త్యాగాలకు గుర్తుగా జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డిఎస్‌పి టి వెంకటేశులు, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ ఏ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్‌ఐ బి శ్రీకాంత్ నాయక్, అడ్మిన్ ఆర్‌ఐ ఎల్ మన్మథరావు, ఏ ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.










