Aug 17,2023 00:23
ఎమ్మెల్యేని కలిసిన చెరుకూరు యానాదులు

ప్రజాశక్తి-పర్చూరు: పర్చూరు మండలం చెరుకూరు గ్రామ యానాదులు కాలనీలో సెప్టెంబర్‌ మొదటివారంలో జరిగే పోలేరమ్మ కొలుపులకు హాజరుకావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావును కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరిని మర్యాద పూర్వకంగా కలిసి తమ గ్రామాల్లో జరిగే పూజా కార్యక్రమాలకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. యానాదుల అభివృద్ధికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయానికి వచ్చిన కొండేపి శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయ స్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్‌ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీను, పొట్లూరి సుబ్బారావు, ఇండ్ల శ్రీమాన్‌, శివ, అంకమ్మ, రాము, నాగేశ్వరరావు, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.