ప్రజాశక్తి-సీతమ్మధార : ఎపి ప్రభుత్వ స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యాన సీతమ్మధారలోని కృష్ణ మందిరంలో విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యులు గొండు సీతారాం ,చైల్డ్ వెల్ఫేర్ రీజినల్ చైర్మన్ ఎం.మాధవి వర్మ, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పప్పల రామ్మోహన్ రావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, వరుదు కల్యాణి మాట్లాడుతూ, 12 నుంచి 16 ఏళ్లు లోపున్న బాలికలపై అత్యాచారాలకు పాల్పడే మృగాళ్ల భరతం పట్టేందుకు పదునైన అస్త్రం లాంటిది ఈ చట్టం అని తెలిపారు. వికృత చేష్టలతో పిల్లల హక్కులను హరించే వారిని కఠినంగా శిక్షించేలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసలి అప్పారావు, కమిషన్ సభ్యులు గొండుసీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో పోక్సో కేసులు ఎన్ని నమోదై ఉన్నాయి. వాటి పూర్వాపరాలు ఎలా ఉన్నాయి, పిల్లలకు ఎంత వరకు న్యాయం చేకూరుతోంది, ఫిర్యాదులు అందించేందుకు పోలీసు స్టేషన్లకు వచ్చే పిల్లలపై పోలీసులు అందిస్తున్న ప్రేమ పూర్వక, స్నేహపూర్వక విధివిధానాలు, తీరుపై సమగ్రవంతంగా తమ కమిషన్ సారథ్యంలో అన్ని జిల్లాల అధికార యంత్రాంగాల నుంచి వివరాలు సేకరించి వివిధ అంశాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, ఐసిడిఎస్ ప్రోజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరి, దిశ పోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె.నీలిమ, బి.సి.కార్పొరేషన్ డైరెక్టర్ సనపల రవీంద్ర భరత్, చైల్డ్ లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ డేవిడ్ రాజు, ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ పి.ఆనందరావు, కీ స్టోన్ స్కూల్ ప్రిన్సిపల్ ఉదరు కుమార్, సీఆర్పీఎఫ్ ప్రతినిధులు హరీష్, ఆదిమూర్తి, ప్రవీణ త్రినాథ్, సీతారామకృష్ణ, డాక్టర్ జగ్గారావు, చినతల్లి, విద్యార్థులు పాల్గొన్నారు.










