లైంగిక నేరాలకు సంబంధించినంత వరకు... మన న్యాయశాస్త్ర చరిత్రలో... లైంగిక దాడి చేసిన మగవాడి దృష్టి నుంచే చూడటం జరుగుతున్నది. అంతేగాని, బాధితులైన ఆడవారి కోణం నుంచి, పిల్లల వైపు నుంచి చూసే సున్నితత్వం లేదు. బాధితుల మీద లైంగిక భావనతో చేసే చర్య ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మరీ ముఖ్యంగా పిల్లలపై దాని ప్రభావం ఏవిధంగా వుంటుంది ?
ముంబై హైకోర్టుకు చెందిన నాగపూర్ బెంచి బాలబాలికలపై జరిగే లైంగిక వేధింపులపై ఇటీవల ఒక దారుణమైన, అసాధారణ తీర్పు ఇచ్చింది. చిన్న పిల్లలు అత్యాచారానికి గురైన సందర్భంలో వారి ఒంటి మీద బట్టలు వుండి, చర్మానికి చర్మం తగలనంత వరకు దానిని రేప్ చేసే ప్రయత్నంగా భావించలేమనీ...ఆవిధంగా పోక్సో చట్టంలోని 7వ సెక్షన్ వర్తించదనీ తీర్పు ప్రకటించింది.
పోక్సో చట్టం లోని 7వ సెక్షన్ ఈ విధంగా చెప్తున్నది- సెక్స్ చేద్దామనే కోరికతో ఎవరైనా పిల్లల మర్మాంగాలను, ఎద భాగాన్ని తాకినా...లేక పిల్లల చేత ఆయా భాగాలను తాకించాలని చూసినా... లేక సెక్స్ చేయాలనే కోరికతో అంగ ప్రవేశం లేకుండా శారీరక సంబంధం వున్నా అది లైంగిక అత్యాచారం కిందకే వస్తుంది. నిందితుడి తప్పును నిర్ధారించిన అడిషనల్ సెషన్స్ కోర్ట్ ఇచ్చిన తీర్పును నాగపూర్ హైకోర్టు బెంచి తోసిపుచ్చింది. కానీ, బయటకు చెప్తున్న కారణం...సెక్షన్ 7 కింద విధించే కనీసం 3 ఏళ్ల జైలు శిక్ష కఠినంగా వున్నదని జడ్జి భావించటమే. బహుశా 'దామాషా' సిద్ధాంతం దీనికి ఆధారమేమో. తీర్పులో చెప్పిన దాని ప్రకారం- 'నేర తీవ్రతను బట్టి నేరానికి అనుగుణమైన శిక్ష వుండాలనేది ప్రాథమిక సూత్రం''.
తీర్పులో పేర్కొన్న సత్యాలను ముందుగా పరికిద్దాం. 2016 డిసెంబర్ 12వ తేదీన 12 సంవత్సరాల బాలిక తన నివాస ప్రాంతంలో వున్న దుకాణానికి పండ్లు కొనుక్కుందామని వెళ్ళింది. ఈ విషయం చెపుతూ జడ్జి 'ఆమెకు కావలసిన బుద్ధి జ్ఞానం లేకపోలేదు'' అని తీర్పులో నిర్దయగా పేర్కొన్నారు. అప్పుడు అదే ప్రాంతంలో వుండే 39 ఏళ్ల వ్యక్తి ఆమె చేయి పట్టుకుని, ఆ పండ్లు తను ఇస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఆమె తల్లి ఈ పిల్ల కోసం వెతకటం చూసి, ఆ పాప నిందితుడితో కలసి వెళ్లిందని పొరుగు వ్యక్తి చెప్పాడు. తల్లి నిందితుడి ఇంటికి వెళ్లి వాకబు చేయగా, ఆ పిల్ల అక్కడ లేదని చెప్పాడు. గొళ్ళెం పెట్టివున్న తలుపును బలవంతంగా తెరిచి, లోపల వెతకగా అక్కడ పాప ఏడుస్తూ కనపడింది. అ మగ మనిషి తన ఎద భాగాన్ని నొక్కాడని, తన వంటి మీద వున్న సల్వార్‌ను తీసేందుకు ప్రయత్నించాడని అ పిల్ల తల్లికి చెప్పింది. వెంటనే ఆమె బిగ్గరగా కేకలు వేయగా, నిందితుడు బయటకువెళ్లి ఇంటికి తాళం పెట్టాడు. జడ్జి గారి భావన ప్రకారం, ఆ పిల్లేగనుక వికలాంగురాలు అయినట్లయితే, నేరం చాలా తీవ్రమైనదే.
లైంగిక నేరాలకు సంబంధించినంత వరకు... మన న్యాయశాస్త్ర చరిత్రలో... లైంగిక దాడి చేసిన మగవాడి దృష్టి నుంచే చూడటం జరుగుతున్నది. అంతేగాని, బాధితులైన ఆడవారి కోణం నుంచి, పిల్లల వైపు నుంచి చూసే సున్నితత్వం లేదు. బాధితుల మీద లైంగిక భావనతో చేసే చర్య ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మరీ ముఖ్యంగా పిల్లలపై దాని ప్రభావం ఏవిధంగా వుంటుంది? మహారాష్ట్రలో 1972లో 14 ఏళ్ల ఆదివాసీ బాలికపై పోలీసుస్టేషన్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. ఆ బాలిక నుంచి ప్రతిఘటనగానీ, శరీరంపై బయటికి కనపడే గుర్తులు గానీ లేనందువల్ల ఆ బాలిక సమ్మతితోనే జరిగిందని సుప్రీంకోర్టు చెప్పింది. 'సెక్స్ ఆమెకు అలవాటే కనుక, తనతో సంపర్కానికి పోలీసులను (వారు అప్పుడు డ్యూటీలో ఉన్నారు) రెచ్చగొట్టింది'' అని తీర్పులో చెపుతూ, నిందితులను నిర్దోషులుగా వదిలివేసింది.
దశాబ్దాలుగా 'ఈవ్ టీజింగ్' అనే పదాన్ని లైంగిక వేధింపులకు వాడుతున్నారు. నిషేధించబడిన పండును తినటానికి పురుషుడిని ప్రేరేపించటం జరిగిందన్నది బైబిల్ కథనం. ఆ విధంగా 'టీజ్' అనే మాట పుట్టింది. ఇప్పటికి కూడా భారత శిక్షా స్మృతి లోని 354 సెక్షన్ లైంగిక వేధింపుల నేరం 'స్త్రీ మానభంగం' గానే వివరిస్తున్నది.
ఇదేదో విక్టోరియా కాలం నాటి భాషకు సంబంధించిన సమస్య కాదు. స్త్రీ తన దుస్తులు, ప్రవర్తన ద్వారా తన 'మర్యాదను' కోరుకుంటుంది. లేకపోతే ఆమె 'దాన్ని కోరుకుంటున్నట్టు'గానే వివరిస్తుంది.
ఒక స్త్రీ శరీర సమగ్రత, దానిపై ఆమెకున్న అధికారం మన దేశంలో వున్న శాసనాలు చేయటానికి ఆధారం కాదు. పిల్లలకైతే వివిధ స్థాయిలలో జరిగే లైంగిక దాడులకు ప్రత్యేకమైన చట్టం లేదు. అదేవిధంగా పిల్లల సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన న్యాయ ప్రక్రియ లేదు. బహిరంగ న్యాయ స్థానంలో పిల్లను/పిల్లవాడిని నిలబెడతారు. ఆమె భయపడుతున్నా, బాగా ఏడుస్తున్నా, తనకు జరిగిన భయానక ఘట్టాన్ని, వయోజనుడైన నిందితుడు చేసిన దాడి గురించి సవివరంగా చెప్పమని ప్రశ్నిస్తుంటారు. అత్యాచారం నుంచి బయటపడిన వారు, మహిళా సంఘాల వారు, ఉద్యమకారులు, సామాజిక స్పృహ కలిగిన పౌరులు...లైంగిక నేరాలలో నిందితుడిని కేంద్రంగా చేసుకుని న్యాయ ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి అనేక ప్రయత్నాల మూలంగానే మహారాష్ట్ర కేసు తరువాత, మళ్ళీ నిర్భయ కేసు తర్వాత చట్టాలలో మార్పులు తీసుకువచ్చారు. ఆ ఫలితంగానే లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణకు ప్రత్యేకమైన చట్టం వచ్చింది. అనేక దశాబ్దాలుగా పిల్లలకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి, ఇప్పుడు న్యాయచట్రం లోకి వచ్చేలా చేయటం జరిగింది. ఇప్పుడున్నది అత్యుత్తమ న్యాయ చట్రమేనా అంటే...బహుశా కాదేమో. విధిస్తున్న శిక్ష తగినదేనా? చేసిన నేరం కంటే పెద్ద మోతాదులో శిక్ష ఉన్నదనే దానిపై ఆధారపడి వాదించటం లేదు. మరణదండన మానభంగాలను ఆపలేకపోయిందని చెప్పటానికి గట్టి రుజువులు ఉన్నాయి. అంతేగాక, బాధితుల ప్రాణాలు తీసేంత హాని తలపెట్టడానికి కూడా అవకాశం వున్నది. ఆమె కనుక ప్రాణాలతో లేకపోతే తనపై జరిగిన నేరాన్ని చెప్పలేదు. ఆ విధంగా శిక్ష తక్కువలో పడొచ్చు. 'తక్కువ కఠినం'గా శిక్షలు వుండే విధంగా చట్టాలలో మార్పు రావాలనే న్యాయశాస్త్ర విమర్శకుల ఎదుట ఇప్పుడు నాగపూర్ తీర్పు ప్రశ్నార్థకంగా నిలబడింది.
(వ్యాసకర్త సిపి(ఐ)ఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ ఎం.పి)
బృందా కరత్











