Jul 03,2023 01:44
పోగొట్టుకున్న బ్యాగును అందిస్తున్న మెరైన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు

ప్రజాశక్తి-బాపట్ల: సముద్ర స్నానానికి వచ్చిన యువకులు పోగొట్టుకున్న బ్యాగును మెరైన్‌ పోలీసులు తిరిగి అప్పగించిన సంఘటన ఆదివారం బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో జరిగింది. మెరైన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన జయదేవ్‌ బిశ్వాల్‌ సూర్యలంక బీచ్‌కు వచ్చాడు. బీచ్‌లో బ్యాగ్‌ బ్యాగు పోగొట్టుకున్నాడు. మెరైన్‌ పోలీసులు విధులు నిర్వహిస్తున్న బాపట్ల రూరల్‌ పోలీసులు సూర్యలంక ఆటోస్టాండ్‌ దగ్గర బ్యాగ్‌ కోసం గాలించారు. అయితే ఆటో డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం నిజాయతీగా బ్యాగులు తెచ్చి సూర్యలంక మెరైన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావుకు, అవుట్‌ పోస్ట్‌ సిబ్బందికి అప్పజెప్పాడు. వెంటనే మైక్‌ ద్వారా బ్యాగు దొరికినట్లు సమాచారం అందించారు. పోగొట్టుకున్న జయదేవ్‌ బిశ్వాల్‌దిగా గుర్తించి బ్యాగును అందజేశారు. ఆటో డ్రైవర్‌ నిజాయితీకి మెరైన్‌ ఎస్‌ఐ శ్రీనివాసరావు అభినందించారు. బ్యాగును అందజేసిన వారిలో రూరల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పోతురాజు, పోలీసు సిబ్బంది ఉన్నారు.