Jan 08,2023 23:15

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కిరణ్‌, పాల్గొన్న గిరిజనులు

- కందకాలు తవ్వడం సరికాదు
- సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి కిరణ్‌
ప్రజాశక్తి- ఎటపాక

పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులపై అటవీశాఖ అధికారుల వేధింపులు ఆపాలని సీపీఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని గొల్లగొప్ప గ్రామంలో ఆదివారం సిపిఎం నాయకులు పర్యటించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కిరణ్‌ మాట్లాడుతూ గొల్లగొప్ప గ్రామంలోని పోడు భూముల్లో కందకాలు తవ్వాలనే ఆలోచనతో ఆదివాసీలను ఫారెస్ట్‌ అధికారులు, సిబ్బంది భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు సీపీఎం అండగా ఉంటుందని, ఫారెస్ట్‌ అధికారుల బెదిరింపులకు ఎవరు భయపడవద్దని సూచించారు. పోడు భూముల్లో ఎర్రజెండా ఎగురవేయలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. పోడు భూముల్లో కందకాలు తవ్వాలనే ఆలోచన మానుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి ఐవి, నాయకులు ఇరపా అజరు, పులుసు బాలకృష్ణ, గిరిజన సంఘం నాయకులు పెనుబల్లి వెంకన్నబాబు, లాయర్‌ మడివి రవితేజ పాల్గొన్నారు.