Sep 29,2022 23:08

సిపిఎం నేత కిల్లో సురేంద్ర

ప్రజాశక్తి -ముంచంగిపుట్టు: మండలంలో దోడి పుట్టు గ్రామ పంచాయతీలో సిపిఎం ఆధ్వర్యంలో దేశ రక్షణ బేరి బహిరంగ సభ బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం నూతన అటవీ పాలసీ చట్టం తీసుకొచ్చి ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులు అందరికీ పోడు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. దేశ ప్రజలపై బిజెపి ప్రభుత్వం అధిక ధరలు, జీఎస్టీ పన్ను పెంచుతుందన్నారు. మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెంచుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పి.భీమరాజు, గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుడు దొంబ్రు పాల్గొన్నారు.