ప్రజాశక్తి-విఆర్.పురం
కూనవరం మండలం, పాలగూడెం గ్రామంలో గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములకు, పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన్ కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలగూడెం గ్రామంలో శనివారం జరిగిన సిపిఎం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల సాగు భూములకు పట్టాలివ్వకుంటే ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ ముంపులో లేని పాలగూడెం, రామవరం గ్రామాలకు రోడ్డు, హౌసింగ్ కాలనీ మరుగుదొడ్లు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, పార్టీ కూనవరం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, మండల కమిటీ సభ్యులు బాబు, టి.తమ్మయ్య, మదెం బాబూరావు, కొమరం బజారు, నూపా ముత్తయ్య, చెన్నకేశవరావు, నూప పొద్దయ్య, జుర్కే ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.










