సర్వేను ప్రారంభిస్తున్న వైఎస్ ఎంపిపి
ప్రజాశక్తి-గొలుగొండ:మండలంలోని చోద్యం పరివాహక ప్రాంతంలో 120 కుటుంబాల కొండపోడు భూములకు సంబంధించి పట్టాల మంజూరు కోసం గురువారం సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపిపి సుర్ల ఆదినారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కొండు పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశాలతో నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ సూచనలతో ఈ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. సర్వే చేసి త్వరలో పట్టాలు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్ డైరెక్టర్ బొందల రాజు, చోద్యం గ్రామ వైసిపి అధ్యక్షులు పోతల సత్యనారాయణ, సర్వేయర్ చినబాబు తదితరులు పాల్గొన్నారు.










