May 05,2023 00:18

పొన్నూరు కళాపరిషత్‌ నాటక పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి- పొన్నూరు రూరల్‌:పొన్నూరు కళాపరిషత్‌ 22వ తెలుగు రాష్ట్రాల పోటీలు గురువారం నిడుబ్రోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలలో ప్రారంభమైయ్యాయి. నన్నపనేని చంద్రమౌలేశ్వరి ప్రార్ధన గీతం ఆలపించిగా చిన్నారి ఎం. వల్లి నాగమారుతి శ్యాస్త్రీయ నృత్య ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైయాయి. తోలుత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి.వెంకట రోశయ్య పాల్గొని మాట్లాడుతూ నేటి విద్యార్ధులకు కళల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ప్రాచీన కళల పట్ల నేటి తరానికి తెలిసేలా పోటీలు నిర్వహిస్తున్న పరిషత్‌ను అభినందించారు. అనంతరం శ్రీ సాయి ఆర్ట్స్‌ కొలకలూరి వారి ప్రేమతో నాన్న నాటిక ప్రదర్శన జరిగింది. ఎన్ని చట్టాలు ఉన్న న్యాయ స్థానలు ఉన్న ఎక్కడో దగ్గర స్త్రీకి అన్యాయం జరుగుతూనే ఉంది. జీవితంలో అపజయలు ఎదుర్కొని విజయం సాధించే కూతుర్లకు ప్రేమతో నాన్న నాటిక ఆలోచింపచ్చేసింది. రెండో నాటికగా శ్యార్వాణి గ్రామీణ సాంస్కృతిక సేవా సంఘం బొరివంక శ్రీ కాకుళం వారి కొత్త పరిమణం నాటిక ప్రేక్షకులను రంజింపచ్చేసింది. కార్యక్రమంలో ఎంపిపి భవనం పద్మ లీల, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ఆకుల వెంకటేశ్వరరావు, జక్కా శ్రీనివాసరావు, ఏస్‌.ఆంజనేయులు నాయుడు, ఆకుల సాంబశివరావు పాల్గోన్నారు.