
ప్రజాశక్తి - వేటపాలెం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాల పరిధిలో రసాయన శాస్త్ర విభాగంలో పరిశోధనా గ్రంథాన్ని సమర్పించిన పొన్నూరి భరత్‌కు పీహెచ్ డిగ్రీని ప్రధానం చేశారు. విశ్వవిద్యాలయ రసాయన శాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య డి రామచంద్రన్ పర్యవేక్షణలో 'ఐసోలేషన్ అండ్ క్వాంటిఫికేషన్ ఆఫ్ ఇమ్ ప్యూరిటీస్ ఇన్ స్పెసిఫైడ్ డ్రగ్స్ బై ద డెవలప్మెంట్ ఆఫ్ క్రోమోటోగ్రఫిక్ అండ్ స్పెక్ట్రో స్కోపిక్ మెథడ్స్' అంశంపై లోతైన పరిశోధనలు భరత్ జరిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో 19పరిశోధన పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పరిశోధనల సమన్వయకర్త డాక్టర్ పి కిరణ్మయి, వర్సిటీ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు భరత్ స్వగ్రామమైన వేటపాలెం మండలం రావూరుపేట గ్రామ ప్రజలు ఆయన తల్లిదండ్రులు పొన్నూరు రమేష్, సునీతకు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. మరో ఆరు నెలల్లో భరత సోదరుడు వెంకట సురేంద్ర గుప్తా కూడా రసాయన శాస్త్రంలోని పీహెచ్‌డి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.