
ప్రజాశక్తి - పాలకోడేరు
తాను పుట్టిన ఊరిలో తాను ఛైర్మన్‌గా ఉన్న పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ డైరీలు అందించిన పొన్నమండ బాలకృష్ణ అభినందనీయులని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.వెంకటరమణ అన్నారు. గొరగనముడి శ్రీ స్వామి జ్ఞాననంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు విద్యా కమిటీ ఛైర్మన్ బాలకృష్ణ అందించిన స్కూల్ డైరీల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిఇఒ వెంకటరమణ చేతులమీదుగా 150 మంది విద్యార్థులకు డైరీలను పంపిణి చేశారు. అనంతరం డిఇఒను గ్రామ సర్పంచి గొట్టుముక్కల శివాజీరాజు, విద్యా కమిటీ ఛైర్మన్ పొన్నమండ బాలకృష్ణ, మాజీ సర్పంచి చెళ్లబోయిన పాపారావు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి గృహ సారధులు మన్నే మహంకాళి వరప్రసాద్, దిడ్ల రవి, వైసిపి మండల ప్రధాన కార్యదర్శి పంపన రామకృష్ణ పాల్గొన్నారు.