Aug 20,2023 00:16

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు రీజినల్‌ ఆఫీసు ప్రారంభం
ప్రజాశక్తి - తిరుపతి సిటి
తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు రీజినల్‌ కార్యాలయాన్ని, ల్యాబొరేటరీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. 34వేల చదరపు అడుగులతో రూ.16.50 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పర్యావరణ భవనంగా నామకరణం చేశారు. జూన్‌లో ఎన్నడూ లేని విధంగా263.13 మిలియన్‌ మెగావాట్ల విద్యుత్‌ వినియోగం పరిశ్రమల ఏర్పాటుకు నిదర్శనమన్నారు. ఎక్కడా కాలుష్యం లేకుండా కాలుష్య నియంత్రణ మండలి అనేక చర్యలు చేపట్టిందన్నారు. నూతన భవనంలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో ఎలాంటి వ్యర్థాలు విడుదల చేస్తున్నాయో గమనించి అప్పటికప్పుడు చర్యలు చేపడతారన్నారు. ఆక్వారంగం ద్వారా జరిగే కాలుష్యాన్ని నివారించే చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి మద్దిల గురుమూర్తి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ మెంబర్లు మరకా శివకష్ణారెడ్డి, పాకా సురేష్‌, డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్మెంటల్‌ ఇంజనీర్‌ కెవి రావు సీనియర్‌ ఎన్విరాన్మెంటల్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌, ఆర్‌.ఓ కడప అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు