
పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు,రైతులు
ముదిగుబ్బ : మండలంలోని రామస్వామి తండా క్లస్టర్ పరిధిలో పొలంబడి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రమణా రెడ్డి , డిఆర్‌సి ఎడిఎ సత్యనారాయణ, ఎఒ లక్ష్మీనరసింహులు, సర్పంచి ్ మినీ బారు, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. పొలంబడి ఫ్లాట్ లలో అమర్చిన లింగాకర్షక బుట్టలు, పక్షి స్థావరాలు, సాగుచేసిన కంచెపంట, ఎర పంటలను, వేరుశనగ పంటను పరిశీలించారు. అనంతరం పొలంబడి రైతులకు పొలంబడి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, పొలంబడి రైతులు పాల్గొన్నారు.