అవగాహన కల్పిస్తున్న ఏరో స్పేస్ సిబ్బంది
ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని దేవవరం పంచాయతీ ఒడ్డిమెట్టలో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో గరుడ ఎరో స్పేస్ సహకారంతో డ్రోన్ స్ప్రే పై అవగాహన కల్పించారు. పంట పొలాల్లో డ్రోన్ స్ప్రే డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ గింజాల అప్పారావు మాట్లాడుతూ, పది లీటర్ల కెపాసిటీ గల డ్రోన్ 4 లక్షల 50 వేలు ఉంటుందని, రైతులకు 50 శాతం సబ్సిడీపై అందించడం జరుగుతుందన్నారు. ఇది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డ్రోన్ స్ప్రేకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి గలవారు శిక్షణ పొందిన వెంటనే ఉద్యోగ అవకాశం లభిస్తుందన్నారు.










