Jun 07,2023 19:46

రైతులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ మల్లికార్జున

ప్రజాశక్తి - చిప్పగిరి
పొలాల దగ్గర ఏర్పడిన చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకుని గొడవలకు పాల్పడవద్దని ఎస్‌ఐ మల్లికార్జున రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని నేమకల్లు గ్రామంలో ప్రజలు, రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మధ్యకాలంలో రైతులు పొలం సమస్యలపై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఏ సమస్యనైనా మరింత జటిలం చేసుకోకుండా సావదానంగా పరిష్కరించుకోవాలన్నారు. పెద్దలను అడిగి పూర్వాపరాలు పరిశీలించి సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప గొడవలకు దిగి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఆర్థికంగా నష్టపోవద్దని కోరారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలకు ఎవరైనా పాల్పడితే తమకు సమాచారం అందించాలని కోరారు. పోలీసులు బాష, శంకర్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.