Jul 14,2023 21:52

ఫొటో : పంటను పరిశీలిస్తున్న అధికారులు

పొగాకు వేలం ధరలు పరిశీలన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని డిసిపల్లి పొగాకు బోర్డును రీజనల్‌ మేనేజర్‌ లక్ష్మణరావు శుక్రవారం సందర్శించి పొగాకు వేలం ప్రక్రియను, ధరలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి పొగాకు పంట రైతులుకు మంచి ఆదాయాన్ని ఇస్తుందని, రైతులు వచ్చే ఏడాది అధిక ధరలకు పొగాకు బ్యారన్లు పొలాలు లీజుకు తీసుకుంటున్నారని, దీని వల్ల ఖర్చులు బాగా పెరిగి నష్టాలు వచ్చే అవకాశం ఉందని, రైతులు పొగాకు బోర్డు అనుమతించిన మేరకే పొగాకు పండించాలని, ఎక్కువగా పొగాకు పంటని పండించడం వల్ల డిమాండ్‌ తగ్గి నష్టాలు వచ్చే అవకాశం ఉండవచ్చునని తెలిపారు.
పొగాకు బోర్డు ద్వారా ఎరువులు, ఇతర ఇన్‌పుట్‌, ఫర్టిలైజర్‌ ఇండెంట్లను జూలై 26వ తేదీలోపు ఇవ్వాలన్నారు. సిటిఆర్‌ కందుకూరు వారి ద్వారా పొగాకు విత్తనాలు జూలై 19 నుండి ప్రారంభిస్తున్నట్లు, కమర్షియల్‌ నారుమడి రైతులు ఆగస్టు01 నుండి సిటిఆర్‌ఐ కందుకూరులో ఇస్తారన్నారు. రైతులు భూ సారన్ని పెంచుకునేందుకు వారి పొలాల్లో తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువులను పెంచాలన్నారు. కార్యక్రమంలో వేలం నిర్వహణ అధికారి జి.రాజశేఖర్‌, పొగాకు బోర్డు సిబ్బంది, అధికారులు రైతులు పాల్గొన్నారు.