Jun 01,2023 00:17

ర్యాటీని ప్రారంభిస్తున్న డాక్టర్‌ విజయమ్మ

ప్రజాశక్తి-బాపట్ల : పొగాకు ఉత్పత్తులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, పొగాకు వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ తెలిపారు. ప్రపంచ పొగాకు ఉత్పత్తుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ర్యాలీ నిర్వహిం చారు. ఈ ర్యాలీని డాక్టర్‌ విజయమ్మ ప్రారంభించారు. అనంతరం డాక్టర్‌ విజయమ్మ మాటా ్లడుతూ పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా పర్యావరణం కాలుష్యం కోరల్లో చిక్కుక్కుపోతుందన్నారు. దీంతో ప్రజల ఆయుర్ధాయం క్షీణిస్తుందన్నారు. పొగాకు ఏ రూపంలో వినియోగించిన మానవాళి ఆరోగ్యంపై నిశ్శబ్ద హానికి దారి తీస్తుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పరిధిలో సిగరెట్‌, ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధిం చాలన్నారు. ధూమపానంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8 మిలియన్ల మంది మత్యువాత పడుతున్నారన్నారు. సిగరెట్‌ ధూమపానంతో నాలుగు వేల రకాల రసాయనాలు మానవ అవయవాలపై ప్రభావం చూపి నోటి, గొంతు కేన్సర్‌ను దారితీస్తుందన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం పట్ల ప్రజలు అప్రమత్తమై ప్రజారోగ్య పరిరక్షణకు సమిష్టి కషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ స్టాఫ్‌ ఇమ్యూనైజేషన్‌ అధికారి టి.వెంకటేశ్వర్లు, బి. రోహిణి రత్నశ్రీ ,సౌజన్య , దంత వైద్యులు సరళ , జిల్లా పొగాకు నియంత్రణ సోషల్‌ వర్కర్స్‌ పి.సుజాత, బి.రమేష్‌ , ఇస్మాయిలు, లక్ష్మి , యుగంధర్‌, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, విద్యార్థులు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. భట్టిప్రోలు : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని భట్టిప్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకేంద్రం సిబ్బంది మాట్లాడుతూ పొగాకు వినియోగం వల్ల కేన్సర్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా సిగరెట్‌, బీడీ, గుట్కా, తంబకు వల్ల ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు వీటికి దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యకుంద్రం వైద్యుడు డాక్టర్‌ శ్రీనివాసరావు,సిహెచ్‌ఒ మాతయ్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కొల్లూరు : పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్యసిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్‌ ఎన్‌. సుష్మాసేన్‌ మాట్లాడుతూ ధూమపానం వల్ల టిబి వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. టిబి వ్యాధి అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి అని తెలిపారు. పొగాకు ఉత్పత్తులతో తయారు చేసిన సిగరెట్లు బీడీలు చుట్టలు తాగడం వల్ల కేన్సర్‌ వ్యాధి బారీన పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కారంచేడు : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని స్వర్ణ, దగ్గుబాడు గ్రామాలలో వైద్యసిబ్బంది ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల్యాబ్‌ టెక్నీషియన్‌ బయ్య శంకర్‌, దగ్గుబాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్‌ కష్ణ బాబు, ఎంపిహెచ్‌ఒ భాస్కరరావు, సుధాకర్‌రావు. శారమ్మ, స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ హష్మ ప్రియ, ఎంఎల్‌హెచ్‌పిలు అనూష, నూర్జహాన్‌, అశ్విని, ఎఎన్‌ఎంలు నాగలక్ష్మి సౌజన్య, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.