Jul 06,2023 23:22

బహుమతి అందుకుంటున్న వ్యాసరచన పోటీలో గెలిచిన విద్యార్థి

దుగ్గిరాల: పొగాకు ఉత్పత్తులకు యువత దూరంగా ఉండా లని దుగ్గిరాల పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ అబ్దుల్‌ రెహ మాన్‌ అన్నారు. యాంటీ టుబాకో డే ను పురస్కరించు కొని గురువారం స్థానిక జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ లోని 7,8,9 తరగతి విద్యార్థులకు వ్యాసరరచన పోటీలు నిర్వ హించారు. విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను గురించి అవగాహన కల్పించామని, కౌమార దశలో ఉన్న పిల్లలను పొగ తాగడం, పొగాకు నమలడం, పొగాకు ఉత్ప త్తులకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహించినట్లు రెహమాన్‌ చెప్పారు. కార్యక్రమంలో మండల విద్యాధికారులు కె.శ్రీనివాసరావు, కె లక్ష్మీనారా యణ పాల్గొన్నారు.