Oct 30,2022 22:19

సమావేశంలో మాట్లాడుతున్న సత్యాంజనేయ

ప్రజాశక్తి -ములగాడ: డబ్బును పొదుపు చేయడం ద్వారా సంపద సృష్టి జరుగుతుందని, అప్పుల బెడద తగ్గుతుందని, చేతివృత్తులు సుసంపన్నం అవుతాయని, ప్రముఖ కార్మిక నాయకులు బి.సత్యానందం తెలిపారు. మల్కాపురంలోని ప్రకాష్‌నగర్‌ శాఖ గ్రంథాలయంలో ఆదివారం ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొదుపు సంఘాలు మహిళా సాధికారత సాధనలో ముందున్నాయని ప్రశంసించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జాతీయ సేవా పథకం జిల్లా ప్రోగ్రాం అధికారి ఇపిఎస్‌.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, మహిళల్లో ఆత్మవిశ్వాసానికి, నాయకత్వానికి, ఆత్మగౌరవానికి, నిర్ణయీకరణ శక్తికి పొదుపు సంఘాలు ఎంతగానో దోహదపడుతున్నాయనన్నారు. ఇవి మహిళలను ఆర్థికంగా స్వతంత్రులను చేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో ప్రముఖ కవి కె.సత్తిరాజు, గ్రంథాలయాధికారి వి.అజరుకుమార్‌, స్థానిక యువకులు ఎల్‌.సంతోష్‌కుమార్‌, జె.గాంధీ, కె.బాలకృష్ణ, జి.మధు, బి.పవన్‌ తదితరులు మాట్లాడారు. అనంతరం పొదుపు సంఘాల ఉద్యమానికి మహమ్మద్‌ యూనస్‌ చేసిన సేవలపై, మహిళా సాధికారతపై, సాధికారత సాధనలో పొదుపు సంఘాల పాత్రపై చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న వారిని అజరుకుమార్‌ సత్కరించారు.