ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మహిళలు సంపాదనతో పాటు పొదుపును అలవర్చుకోవాలని రాచోటి సుబ్బయ్య తెలిపారు. శనివారం మహాయోగి లక్ష్మమ్మ అవ్వ బ్యాంకు పైఅంతస్తులో శ్రీమహాయోగి లక్ష్మమ్మ ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 45 మంది మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. బోర్డు ఆఫ్ మేనేజ్‌మెంట్ అధ్యక్షులు రాచోటి సుబ్బయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 11 ఏళ్లుగా 2500 మంది పేద మహిళలకు, విద్యార్థినులకు సంస్థలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణ పొందిన అనేకమంది మహిళలు బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో గార్మెంట్స్‌లో ఉద్యోగం చేస్తున్నారని చెప్పారు. నాలుగు నెలలు శిక్షణ పొంది జీవనోపాధితో పాటు పొదుపును పాటించాలని కోరారు. అవ్వ బ్యాంకు ఉపాధ్యక్షులు బాదామి లక్ష్మన్న శెట్టి, డైరెక్టర్లు ఆర్‌ఎంజి.రెడ్డి, సోమిశెట్టి సురేష్, శ్రీనివాసులు, బ్యాంక్ సిఇఒ గట్టు మురళీ కుమార్, నసీరుద్దీన్ పటేల్, బ్యాంకు మేనేజర్ జుల్ఫికర్, శ్యామ్ లాల్ సోనీ, జేరుబండి దానప్ప, టైలరింగ్ మాస్టర్ వెంకటలక్ష్మి, నాగమణి, నరసయ్య పాల్గొన్నారు.
సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్న రామయ్య










