కడప : జిల్లాలో పేదరిక నిర్మూలన, మహిళా అభివది పొదుపు సంఘాల పటిష్ఠతతోనే సాధ్యం అవుతుందని కలెక్టర్ వి. విజయ్ రామరాజు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని విసి హాలులో డిఆర్‌డిఎ, మెప్మా పరిధిలో జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న గహనిర్మాణ రుణాలు, లైవ్ స్టాక్, స్వయం సహాయక సంఘాల పటిష్టత, వివిధ రకాల పనుల పురోగతిపై పీడీలు ఆనంద్ నాయక్, వై. సురేష్ రెడ్డి లతో కలిసి క్షేత్ర స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివద్ధి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. 'పేదలందరికీ ఇళ్ళు' గహ నిర్మాణ పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించినా గహ నిర్మాణాలు బేస్ మెంట్ లెవెల్ ఎందుకు దాటడం లేదన్నారు. మెప్మా పరిధిలో పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా, డిఆర్‌డిఎ పరిధిలో మండలాల్లోనూ చిరు వ్యాపారులకు (స్ట్రీట్ వెండర్లు) స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి పీఎం స్వనిధి, జగనన్న తోడు పథకాలతో పాటు వ్యాపారాభివద్ధి కోసం గ్రూపుల వారీగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. సభ్యులందరికీ పెన్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, నివాస గహాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెలా పొదుపు, రుణ కంతుల మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు పిఒఎస్ మిషన్లకు కలెక్టర్ చేతుల మీదుగా డిఆర్‌డిఎ అధికారులు పంపిణీ చేశారు. సమావేశంలో డిఆర్‌డిఎ డిపిఎంలు, ఏపీడీలు, డిఆర్‌డిఎ, ఏరియా కో-ఆర్డినేటర్లు సి.సి.లు పాల్గొన్నారు. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి జిల్లాలోని పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు కలెక్టర్ వి.విజరు రామరాజు తెలిపారు.శనివారం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ పక్రియ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 1941 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఈ పోలింగ్ కేంద్రాల్లో కొత్తవి కానీ, మెర్జ్ అయినవి కానీ ఏవీ లేవని అన్ని పాత పోలింగ్ స్టేషన్లే ఉన్నాయని తెలిపారు. బద్వేలులో 272, కడపలో 268, పులివెందుల లో 301, కమలాపురం లో 249, జమ్మలమడుగు లో 315, ప్రొద్దుటూరు లో 267, మైదుకూరు లో 269 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో కొన్ని పోలింగ్ కేంద్రాలను మౌలిక వసతులు, ల్యాండ్ ఆక్విజేషన్ రోడ్డు, రోడ్డు వైడనింగ్ లో బాగంగా 124 పోలింగ్ స్టేషన్ల స్థానాలు మారాయని తెలిపారు. అలాగే 264 పోలింగ్ స్టేషన్ల పేర్లను మార్పు చేసినట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఈ ప్రక్రియ పూర్తి చేశామని ఇంకా ఎక్కడైనా పోలింగ్ స్టేషన్లలో సమస్యలు,అభ్యంత రాలుంటే వెంటనే తెలియజేయాలని రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు. కార్యక్రమంలో డిఆర్వో గంగాధర్ గౌడ్, స్పెషల్ కలెక్టర్ రామ్మోహన్,కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీఓలు ధర్మచంద్రారెడ్డి, శ్రీనివాసులు, వెంకట రమణ, వెంకటేశ్వర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు మల్లికార్జున (వైసిపి) బి.హరి ప్రసాద్ (టిడిపి), మనోహర్ (సిపిఎం) కానుగ దానం (బిఎస్‌పి), జి. లక్ష్మణ్ రావు (బిజెపి), ప్రసాద్ గౌడ్ (కాంగ్రెస్), బి శ్రీనివాసులు (ఆప్), శివ, తహశీల్దార్లు, కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఉపాధి హామీ లక్ష్యాన్ని అధిగమించాలి
కడప అర్బన్ : గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న పేదలకు 100 రోజుల పని దినాలను కల్పించడంలో లక్ష్యాన్ని అధిగమించాలని కలెక్టర్ వి.విజరు రామరాజు డ్వామా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ స్పందన హాలులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం అమలు, వివిధ రకాల పనుల పురోగతిపై డ్వామా పీడీ పి.యదుభూషన్ రెడ్డితో కలిసి క్షేత్ర స్థాయి అధికా రులతో సమీక్షించారు. సమావేశంలో అదనపు పథక సంచాలకులు, విజలెన్స్ అధికారి, కార్యాలయ సిబ్బందితో పాటు అందరూ సహాయ పథక సంచాలకులు, అదనపు కార్యక్రమ అధికారులు, ఇంజినీరింగ్ సహాయకులు పాల్గొన్నారు.










