Aug 19,2023 21:00

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజరు రామరాజు

 కడప అర్బన్‌ జిల్లాలో పేదరిక నిర్మూలన, మహిళా అభివద్ధి, పొదుపు సంఘాల పటిష్ఠతతోనే సాధ్యం అవుతుందని కలెక్టర్‌ వి. విజరు రామరాజు ఆదేశించారు. శని వారం కలెక్టరేట్‌ స్పందన హాలులో డిఆర్‌డిఎ, మెప్మా పరిధిలో జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న హౌసింగ్‌ నిర్మాణం, లైవ్‌ స్టాక్‌, స్వయం సహాయక సంఘాల పటిష్టత, వివిధ రకాల పనుల పురోగతిపై క్షేత్ర స్థాయి అధి కారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివద్ధి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. 'పేదల ందరికీ ఇళ్లు' గహ నిర్మాణ పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించినా గహ నిర్మాణాలు బేస్‌ మెంట్‌ లెవెల్‌ ఎందుకు దాటడం లేదన్నారు. గహ నిర్మాణాలకు సంబంధించి లబ్దిదారులకు రూ.35 వేల రుణ సాయాన్ని మండల, మున్సిపాలిటీ పరిధిలోని వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. సిఐఎఫ్‌ ద్వారా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం కింద పులివెం దులలోని అన్ని మండలాలతో పాటు పెండ్లిమర్రి, విఎన్‌ పల్లె మండలాల వారికి కేటాయించిన పాల సేకరణ లక్ష్యాలను అధిగమించాలన్నారు. జగనన్న తోడు, ఉమెన్‌ ఎల్‌ఇడి, డిఆర్‌డిఎ ద్వారా అమలయ్యే కార్యక్రమాలను నిరవధికంగా కొనసాగించాలని పేర్కొన్నారు. ఆయా విభాగాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని, లేని పక్షంలో క్రమశిక్షణ రాహిత్య చర్యలను తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పులి వెందుల నియోజకవర్గంలో అముల్‌ కేంద్రాలకు పాలు వేయని వారిని ఆయా కేంద్రాలకు పాలు పోసేలా ప్రోత్సహించి రైతులను లాభాల బాటలో నడిపిం చాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు స్థానికంగా ఉన్న పాల ఉత్పత్తి దారుల ద్వారానే ఆరోగ్యకరమైన పాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అముల్‌ కంపెనీ భాగస్వామితో ముందుకు సాగుతున్న జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా నడిపించాలని పేర్కొన్నారు. జగనన్న చేయూత పథకం ద్వారా రుణాలు అందించి మహిళా పాడి రైతులు లాభాల బాటలో నడిచేలా చూడాలన్నారు. మెప్మా పరిధిలో పట్టణ ప్రాంతాల్లోనే గాక డిఆర్‌డిఎ పరిధిలో మండలాల్లో కూడా చిరు వ్యాపారులకు (స్ట్రీట్‌ వెండర్లు) కూడా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి పీఎం స్వనిధి, జగనన్న తోడు పథకాలతో పాటు వ్యాపారాభివద్ధి కోసం గ్రూపుల వారీగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. సభ్యులందరికీ పెన్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, నివాస గహాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రాథమిక సెక్టారులోని వ్యవసాయం, ఇండిస్టియల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలన్నారు. డిఆర్‌డిఎ, మెప్మా సిబ్బంది గ్రూప్‌ ఫార్మేషన్‌, ఫైనాన్సింగ్‌, గ్రౌండింగ్‌, బుక్‌ కీపింగ్‌ మొదలైన ప్రక్రియలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలన్నారు. స్వయం సహాయక సంఘాలను భాగ స్వామ్యం చేస్తూ.. జిల్లాలో చేపడుతున్న అభివద్ధి పనులకు సంబంధించి ఎలాంటి పెండింగ్‌ లేకుండా సంపూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిఆర్‌డిఎ పీడీ, డిపిఎంలు, ఏపీడీలు, ఏరియా కో-ఆర్డినేటర్లు, మెప్మా సిఎంఎస్‌లు, సిసిలు పాల్గొన్నారు.