Aug 28,2023 19:24

ఆహా క్యాంటీన్‌ ను ప్రారంభిస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌

పొదుపు మహిళలకు జీవనోపాధే ధ్యేయం
- డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌
ప్రజాశక్తి-డోన్‌

పొదుపు సంఘంలో ఉండే మహిళలకు జీవనోపాధి కల్పించడమే మెప్మా ధ్యేయమని డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ అన్నారు. సోమవారం డోన్‌ పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో పాత బస్టాండ్‌ లోని ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్‌ ని డోన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ సప్తశైల రాజేష్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలోని మహిళా ఎస్‌హెచ్‌జి సభ్యులకు స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించడంలో భాగంగా, ఏపీ ప్రభుత్వం వైస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, చేయూత పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. చదువుతో పాటు ఉపాధిని ప్రోత్సహించడంలో భాగంగా సూక్ష్మస్థాయి జీవనోపాది యూనిట్లును సంఘం సభ్యులు స్థాపించడానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని మెప్మా అందిస్తుందని తెలిపారు. ఎస్‌హెచ్‌జి సభ్యులు ఆహా క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహార ప్యాకెట్లను అవసరమైన వారికి సరఫరా అందించడం జరుగుతుందని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని పొదుపు సంఘంలో ఉండే మహిళలకు చేయూత అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్‌.వెంకటరామిరెడ్డి,మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ లు కొట్రికె హరికిషన్‌,ఎస్‌ఎండి జాకీర్‌ హుస్సేన్‌, కౌన్సిలర్‌ లు,కో ఆప్షన్‌ సభ్యులు కర్నూల్‌ మరియు నంద్యాల జిల్లాల మెప్మా టిఇ లైవ్‌ లి హుడ్స్‌,జి.జిలాని భాష,డోన్‌ మెప్మా టీఎంసీ సుజాత,కమ్యూనిటీ ఆర్గనైజర్‌ జయంతి,డిఈఓ రాము మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.