పనులను పరిశీలిస్తున్న కాంతిలాల్ దండే
ప్రజాశక్తి - మెళియాపుట్టి : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఆదేశించారు. స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణాలను సీతంపేట ఐటిడిఎ పిఒ కల్పనకుమారితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపించకూడదన్నారు. సెప్టెంబర్ 15 నాటికి భవన నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సంబంధిత ఇంజినీర్లకు సూచించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ శ్రీనివాసరావు, డిఇఇలు సిమ్మన్న, సింహాచలం, ఎఇ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.










