సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కరణం
ప్రజాశక్తి-చీరాల: నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా నాణ్యతతో పూర్తిచేయాలని ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యా లయంలో పలు శాఖ అధికారులతో ఇంజనీరింగ్ విభాగ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, గడప గడపకూ మన ప్రభుత్వం, సీఎండీఎఫ్, సాధారణ నిధులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. కమిషనర్ రామచంద్రారెడ్డి, డిఇ ఏసయ్య, వైస్‌చైర్మన్ బాబు పాల్గొన్నారు.










