Jun 02,2023 23:57

అసంపూర్తి భవనాన్ని చూపుతున్న అయ్యన్న

ప్రజాశక్తి నర్సీపట్నం టౌన్‌:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర స్ఫూర్తితో ప్రభుత్వ వైఫల్యా లను ఎండగట్టేందుకు ఆ పార్టీ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలీస్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకడుగు ముందుకేశారు. ఈ క్రమంలోనే నర్సీపట్నం నియోజక వర్గంలో ఆగి పోయిన అభివృద్ధి పనుల ముందు సెల్ఫీ దిగి అయ్యన్న ఛాలెంజ్‌ విసురుతున్నారు.సెల్ఫీ చాలెంజ్‌ ప్రచారాస్త్రంగా స్థానిక ప్రజాప్రతినిధుల వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లేందుకు అయ్యన్న శుక్రవారం ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో అయ్యన్న మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి జిల్లా పర్యటనలకు వచ్చిన పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు గాలిలోకి కలిసి పోయాయన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నాలుగేళ్లయినా నెరవేరలేదని, బైపరెడ్డిపాలెం, బలిఘట్టం దగ్గర పూర్తయిన టిడ్కో ఇళ్లు 80 శాతం పూర్తయినప్పటికీ పంపిణీ చేయలేదని విమర్శించారు. ఉత్తరవాహితీర మందు వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద ఏసీ కళ్యాణ మండపాన్ని 20 శాతం పూర్తి చేస్తే మిగతా పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. తాము కట్టిన వాటర్‌ ట్యాంక్‌లకు టిడ్కో ఇళ్లకు రంగులు వేశారు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. నర్సీపట్నం లో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు టిడ్కో ఇళ్లు నిర్మిస్తే ఇప్పటి వరకూ ఏ ఒక్క లబ్ధిదారుడికి వాటిని మంజూరు చేయకపో వడాన్ని ఎత్తిచూపారు. పట్టణంలో అభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.