Feb 15,2023 23:58

బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ఉమామహేశ్వరరావు

ప్రజాశక్తి - పెదబయలు :కాకినాడ జిల్లాలో ఆయిల్‌ ప్యాక్టరీలో మృతి చెందిన పెదబయలు మండలం పరెడ పంచాయతీ లక్ష్మీపురం బాధిత గ్రామస్తులను బుధవారం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వర్‌రావు, మండల కార్యదర్శి కె.శరబన్నలు బాధిత కుటుంబాలకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే కాకినాడ సీఐటీయూ నాయకులు బాధితుల పక్షాన అండగా నిలిచారని తెలిపారు. లక్ష్మీపురం గ్రామంలో సుమారు 60 కుటుంబాలు నివశిస్తున్నాయని, బతుకు తెరువు కోసం కూలి పనులకు వెళ్లి విగత జీవులయ్యరన్నారు. గ్రామంలో కూలి పనులు లేక పొట్ట చేత పట్టుకొని వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. లక్ష్మీపురం గ్రామంలో 2018 నుండి ఉపాడి హామీ పథకం పనులు జరగ లేదన్నారు. పనులు కల్పించక పోవడంతో వలసలు వెళ్లి పోతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్లి పరామర్శించి ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సొంత ఊర్లో పనులు ఉంటే ఆ ఐదుగురు దుర్మరణం చెంది ఉండేవారు కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వలసలు పెరిగి పోతున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. 5 ఎకరాల భూమి ఇవ్వాలని డి మండ్‌ చేశారు. గ్రామాల్లో ఊపాధి పనులు చేపట్టాలని, లేకుంటే కలెక్టరు కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.