May 20,2023 20:00

పనులు పరిశీలిస్తున్న ఎంపిడిఒ గీతావాణి

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న నాడు-నేడు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపిడిఒ గీతావాణి సూచించారు. శనివారం మండలంలోని ఆరెకల్‌ జడ్‌పి పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నాడు-నేడు కింద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని చెప్పారు. పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉట్టిపడేలా పాఠశాలలను తీర్చిదిద్దాలని ప్రధానోపాధ్యాయులు భవానికి సూచించారు. కుప్పగల్‌ గ్రామంలో జగనన్న కాలనీని సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఇన్‌ఛార్జీ ఇఒఆర్‌డి నాగరాజ్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ నాగ మల్లయ్య, హౌసింగ్‌ తిక్కన్న, ఆర్‌ఐ పెద్దయ్య, విఆర్‌ఒ కౌశిక్‌ వామన్‌ రావు పాల్గొన్నారు.