ప్రజశక్తి - చీరాల
పట్టణంలో అభివృద్ధి పనులను ఎంఎల్‌ఎ కరణం బలరామ కృష్ణమూర్తి ముంతావారి సెంటర్, మసీదు సెంటర్లలో జరుగుతున్న డ్రైనేజీ పనులను శనివారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సత్వరమే పనులు పూర్తిచేయాలని ఆదేశించాఉ. నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. ఆయన వెంట చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కౌన్సిలర్ మామిడాల రాములు, గుంటూరు ప్రభాకరరావు, బత్తుల అనిల్, కంప అరుణ్, గోలి జగదీష్, మున్సిపల్ డిఈ యేసయ్య ఉన్నారు










