Dec 06,2020 11:30

కావాల్సిన పదార్థాలు : పన్నీర్‌ కట్‌- రెండు వందల గ్రాములు, పుదీనా ఆకులు- కప్పు, తాజా కొత్తిమీర - కప్పు,
పచ్చిమిర్చి - నాలుగు లేదా ఆరు, అల్లం- అంగుళం, లవంగాలు, వెల్లులి- ఒక్కొక్కటి 10 లేదా 12, పెరుగు- టేబుల్‌స్పూన్‌, మిరియాల పొడి- అరస్పూన్‌, నువ్వులు- స్పూన్‌, గసగసాలు- అరస్పూన్‌, సోంపు గింజలు- అరస్పూన్‌, ఎర్రకారం- అరస్పూన్‌, పసుపుపొడి- అరస్పూన్‌, నిమ్మరసం -అరముక్క, షా జీరా- అరస్పూన్‌, తాజా క్రీమ్‌- టేబుల్‌స్పూన్‌, కూరగాయల నూనె- రెండు స్పూన్‌లు, ఉప్పు- రుచికి తగినంత.
మసాలా కోసం
బిర్యానీ ఆకు- ఒకటి, లవంగాలు- రెండు, మిరియాలు- మూడు లేదా నాలుగు,

నల్ల యాలకులు- ఒకటి, ఆకుపచ్చ యాలకులు- రెండు, దాల్చినచెక్క- అంగుళం.
తయారు చేసే విధానం :
పెరుగు, ఉప్పు, మిరియాల పొడిని కలుపుకోవాలి.
పన్నీర్‌ ముక్కలను బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గసగసాలు, నువ్వులను మిక్సీలో వేసుకుని, ఆ పొడిని పక్కన ఉంచుకోవాలి.
కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, లవంగాలు, వెల్లుల్లిని కొద్దిగా నీరు వేసి రుబ్బుకోవాలి.
పాన్‌ వేడిచేసి కొంచెం నూనె వేసుకోవాలి. గరం మసాలా, సోంపు గింజలను కొన్ని సెకన్లపాటు వేగనివ్వాలి.
తర్వాత గరం మసాలా, షా జీరాను అందులోనే కొన్ని సెకన్లపాటు వేగనివ్వాలి. ముందుగా వేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, లవంగాలు, వెల్లుల్లి పొడినీ వేసి బాగా కలపాలి.
ఉప్పు, ఎర్రకారం, పసుపు పొడి, నిమ్మరసంను కలిపి గ్యాస్‌ మీద 6, 7 నిమిషాలు ఉడకనివ్వాలి. అందులోనే పన్నీర్‌ క్యూబ్స్‌ వేసి మరో 3,4 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా తాజా క్రీమ్‌ను వేసి మెత్తగా తిప్పాలి.
చివరగా రోటీతో వేడిగా తినేయడమే !